
Contributed by Krishna Prasad
ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో మనం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. మనిషికి ప్రకృతి ఎంతగా సహాయం చేస్తుందో తనని నిర్లక్ష్యం చేస్తే అంతే విధ్వంసం సృష్టిస్తుంది.తాజాగా ఇప్పుడు కేరళలో ప్రకృతి ప్రకోపం మనం చూస్తున్నాం.గత వందేళ్ల లో ఎన్నడూ లేనివిధంగా వరదలు కేరళ ని ముంచెత్తి 400 మందిని బలితీసుకున్నాయి.14 జిల్లాలో జరిగిన విధ్వంసం, అక్కడి హృదయ విదారక దృశ్యాలు మొత్తం ప్రపంచానికి కన్నీరు తెప్పించాయి.మనం ప్రకృతి వైపరీత్యాలను ఆపలేం, చెయ్యవలసినదల్లా మనకి చేతనైన సహాయం చెయ్యటమే. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సెలబ్రిటీస్, సామాన్యులు, ఇతర దేశాలు, ఇతర దేశాల ప్రజలు ఇలా అందరూ తమకి తోచినంత సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కార్పోరేట్ సంస్థలు, ఇతర స్వచ్చంధ సంస్థలు కూడా సహాయం అందిస్తున్నాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, మత్స్యకారులు చేస్తున్న సహాయం అయితే మాటల్లో చెప్పలేం. ఆపననహస్తం అందిచాలంటు సోషల్ మీడియా లో పోస్ట్ అవుతున్న విజ్ఞప్తులు ఎంతో మందిని సహాయం చేసేలా చేస్తున్నాయి.#DoForKerala and #KeralaFloods లాంటి హష్ టాగ్లతో న్యూస్ అప్ డేట్ లను అందిస్తున్నాయి. ఇలా సహాయం చేసినవారిలో కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.NDRF రెస్క్యూ ఆఫీసర్ కన్నయ్య కుమార్ :
జ్వరం తో బాధపడుతున్న పిల్లాడిని ఎత్తుకుని, వరద కి కొట్టుకు పోతున్న బ్రిడ్జి మీద నుంచి పరిగెత్తి ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడారు కన్నయ్య కుమార్
2. కేపీ జైసాల్ – మత్స్యకారుడు:
ముగ్గురు మహిళలు వరదలో చిక్కుకు పోవటంతో వాళ్ళని కాపాడటానికి వెళ్ళినా జైసాల్ వాళ్ళని బోటులో ఎక్కించేందుకు వరద నీటిలో పడుకుని తన వీపును మెట్టుగా మర్చాడు. ఆ ముగ్గురిలో ఒకామె వృద్ధురాలు కాగా మరో మహిళ చంటి బిడ్డతో ఉంది.
3. హనన్ – కేరళ యువతి:
విద్యాభ్యాస ఖర్చుల కోసం చేపలు అమ్ముతూ ఇటీవల వార్తల్లో నిలిచిన ఈమె దాతల నుంచి తనకి వచ్చిన మొత్తాన్ని(1.5 లక్షలు) తిరిగి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేసింది.
4.విష్ణు కచ్వా – చిరు వ్యాపారి:
కేరళలోని కన్నుర్ జిల్లాకి చెందిన విష్ణు కచ్వా ఇంటింటికీ తిరుగుతూ బ్లాంకెట్ లు అమ్ముతుంటారు. ఈయన అతని వ్యాపారానికి కావలసిన బ్లాంకెట్ లని హరియనా నుంచి తీసుకువస్తారు.ఎప్పటిలాగే సరుకు కొనుగోలు చేయటానికి వెళ్ళి, తిరిగి వచ్చిన విష్ణు కచ్వా ఇక్కడి పరిస్థితి చూసి చలించి పోయారు.తమ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తన వద్దనున్న అన్ని బ్లాంకెట్ లని, సహాయ శిబరాల్లో ఉన్న వాళ్లకి ఇవ్వమని ఇచ్చేశారు.విష్ణు గురించి తెలుసుకున్న కలెక్టర్, వాటిని ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావు అని వద్దని వారించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని పంచి పెట్టాలన్న విష్ణు కచ్వా మాటలకి కలెక్టర్, అడిచి కుట్టి స్కూల్ శిబిరం లో విష్ణు చేతుల మీదుగా వాటిని పంచి పెట్టారు.
వీళ్ళే కాకుండా ఎంతో మంది ఎన్నో విధాలుగా సహాయం చేస్తూనే ఉన్నారు.
మీరు కూడా మనీ డొనేట్ చెయ్యాలనుకుంటే ఇలా చేయండి.
How to contribute to Chief Minister’s Distress Relief Fund?
1. You can even contribute through ‘paytm’ which will directly transfer funds to the CM Relief Fund Account in just a click away
3.You can also directly transfer funds to CMDRF from your account using these details.
Account number: 67319948232
Bank: State Bank of India
Branch: City branch, Thiruvananthapuram
IFS Code: SBIN0070028
PAN: AAAGD0584M
Name of Donee: CMDRF
PJ
Super fonts